News November 11, 2025
ఆదిలాబాద్: మహిళ మృతి.. నిందితుడి ARREST

ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ శివారులో రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితుడిని అరెస్టు చేశామని సీఐ గురుస్వామి తెలిపారు. చేవుల రత్నమాల తన కుమారుడు చేవుల లక్ష్మణ్‌తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎద్దుల బండిపై గ్రామానికి వెళ్తుండగా అదే సమయంలో నిందితుడు తరడపు ప్రదీప్ కుమార్ తన కారును మద్యం మత్తులో అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ ఎద్దుల బండిని ఢీకొట్టాడు. ప్రమాదంలో రత్నమాల మృతిచెందింది.
Similar News
News November 11, 2025
NGKL: ‘పీఎం ధాన్ ధాన్య కృషి యోజన అమలు పక్కాగా చేయాలి’

నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న ఆరేళ్లపాటు పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక తదితర శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.
News November 11, 2025
TPT: రేపు ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ సమ్మిట్

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ (Startup) సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. SVU సెనెట్ హాల్ వేదికగా బుధవారం ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఔత్సాహిక యువతి, యువకులు https://forms.gle/4Fzc3Hrehf1ZsynS6 వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.


