News April 12, 2024
ప్రకాశం జిల్లాలో ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకాశం జిల్లాలో గురువారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో ఉన్న చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. రోజువారి నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Similar News
News March 2, 2026
10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: ప్రకాశం JC

ప్రకాశం జిల్లాలో ఈనె ల 16వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.
News March 2, 2026
FLASH టంగుటూరు: రైలు ఢీకొని మహిళ మృతి

టంగుటూరు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు గుర్తు తెలియని 50 ఏళ్ల మహిళను కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, వివరాలు తెలిస్తే 924757632 నంబర్‌ను సంప్రదించాలని ఒంగోల్ RPF ఎస్‌ఐ శ్రీరాం తెలిపారు.
News March 2, 2026
ప్రకాశం: కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఒంగోలు యువకుడు హేమంత్ (17) మృతదేహం లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చేపట్టగా, సోమవారం ఈర్నపాడు దగ్గర శవం దొరికినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


