News November 11, 2025
కేటిదొడ్డి: బావిలో అనుమానాస్పద మృతదేహం

కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ పరిధిలోని ఓ బావిలో మంగళవారం అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పైకి తీశారు. మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
మహిళా ఐఏఎస్‌కు గృహ హింస వేధింపులు

సామాన్య మహిళలకే కాదు చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న ఉమెన్ బ్యూరోక్రాట్లకు గృహ హింస తప్పట్లేదు. IAS ఆఫీసర్ అయిన తనభర్త ఆశిష్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ IAS భారతి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లో జరిగింది. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశిష్ సామాజిక న్యాయం విభాగంలో డైరెక్టర్ కాగా, భారతి ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
News November 11, 2025
తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.
News November 11, 2025
‘మనోబంధు’కు సహకరిస్తాం: SP

మనోబంధు కార్యక్రమానికి పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మనోబంధు కార్యక్రమం నిర్వహణ కరపత్రాలను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మానసిక రుగ్మతలతో బాధపడుతూ వీధుల్లో సంచరిస్తున్న వారికి వైద్యం అందించి కుటుంబీకుల చెంతకు చేర్చడం జరుగుతుందన్నారు.


