News November 11, 2025

‘జనజాతీయ గౌరవ్ దివాస్‌’లో ప్రత్యేక గ్రామసభలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివాస్ – 2025 సందర్భంగా ఈ నెల 13న 131 ఆది సేవా కేంద్రాలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. ఈ జన్ సున్వాయి సెషన్‌లో గ్రామాల మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా స్పందనలపై చర్చిస్తారు. నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా జాతీయ వేడుకలు జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. హైకమాండ్(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్‌కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.

News November 12, 2025

MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.

News November 12, 2025

వనపర్తి: నవంబర్ 14 నుంచి ‘మిషన్ మధుమేహ-దృష్టి’

image

డయాబెటిస్ రోగులు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభంలోనే సమస్యలను గుర్తిస్తే నివారించవచ్చని వనపర్తి ఇన్‌చార్జి DMHO సాయినాథ్ రెడ్డి అన్నారు. NOV 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని డయాబెటిస్ రోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ‘మిషన్ మధుమేహ-దృష్టి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను మంగళవారం DMHO కార్యాలయంలో నిర్వహించారు.