News November 11, 2025
జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు!

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్‌కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్‌పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్‌గూడ, రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.
News November 11, 2025
గద్వాల: ‘పాఠశాలలను శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత’

పాఠశాలలను శుభ్రంగా, సురక్షితంగా, బాలికలకు అనుకూలంగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ బి. నర్సింగ రావు పేర్కొన్నారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వజ్ర ఫంక్షన్ హాల్‌లో డీఆర్‌డీఏ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కిశోర బాలికల సమస్యలు, పాఠశాలల్లో వాష్ (WASH – Water, Sanitation & Hygiene) అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
News November 11, 2025
నటి సాలీ కిర్క్‌ల్యాండ్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్‌ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.


