News November 11, 2025

FINAL UPDATE: జూబ్లీహిల్స్‌‌లో 48.43% పోలింగ్ నమోదు

image

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్‌కు అంటే జూబ్లీహిల్స్‌లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.

Similar News

News November 11, 2025

వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ఎన్.తేజ్‌భరత్

image

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ కమినర్‌గా ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం మెప్మా డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కేఎస్ విశ్వనాథన్‌ను ఐఅండ్ పీఆర్ డైరెక్టర్‌గా బదిలీ చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

News November 11, 2025

GWL: రేబిస్ వ్యాధిపై అవగాహన ముఖ్యం

image

రేబిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని మంగళవారం గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. రేబిస్ సోకే విధానం, నివారణ జాగ్రత్తలు, వీధి కుక్కలు కరిస్తే ప్రాథమిక చికిత్స అందించాల్సిన విధానం గురించి విద్యార్థులకు వివరించారు.

News November 11, 2025

అయిజ: ‘చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి’

image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, SI తరుణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయిజ మండలం ఉత్తనూర్ ZPHS ప్రాంగణంలో మంగళవారం SGF జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 బాస్కెట్‌బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపికచేశారు.