News November 11, 2025

PDPL: ప్రతి విద్యార్థికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించాలి: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా అమలుపై సమీక్ష జరిగింది. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులందరూ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల సెలవులు ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆదేశించారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ కోర్సులు అమలు అవుతాయని, జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.

Similar News

News November 12, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,151, కనిష్ఠ ధర రూ.1,641; వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,980, కనిష్ఠ ధర రూ.1,815; వరి ధాన్యం(HMT) ధర రూ.2,055; వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,700, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

News November 12, 2025

రాజ్‌కోట్ నుంచి మహబూబ్‌నగర్‌కు పీయూ ఎన్‌ఎస్‌ఎస్ బృందం

image

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్‌ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

News November 12, 2025

MBNR: ‘సైబర్ కేసులను త్వరగా పరిష్కరించండి’

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ ఎన్.బీ.రత్నం ఆదేశించారు. జిల్లా SP డి.జానకి ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన మంగళవారం సైబర్ వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో కేసులు పరిష్కరించే ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.