News April 12, 2024
భద్రంపల్లి ప్రజలకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాం: బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం (మం) భద్రంపల్లిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి పాల్గొన్నారు. స్మశాన వాటిక లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏళ్ల నుంచి స్మశాన వాటిక సమస్య పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదని గ్రామస్థులు వాపోయారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భద్రంపల్లి ప్రజలకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Similar News
News January 12, 2026
అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.
News January 11, 2026
BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.
News January 11, 2026
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


