News November 11, 2025

‘AI విద్యాబోధన ద్వారా విద్యార్థుల్లో మార్పునకు కృషి చేయాలి’

image

విద్యావిధానంలో ఏఐ విద్యాబోధన ద్వారా విద్యార్థులలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏఐ బోధన, విద్యార్థుల హాజరు శాతం పెంపుదల, నాణ్యమైన విద్యాబోధన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు 100 శాతం హాజరయ్యేలా చూడాలన్నారు.

Similar News

News November 12, 2025

జాతీయస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈనెల 6, 7వ తేదీలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన రాష్టస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్.ప్రమధశ్రీ యస్.శ్రీసాన్విక, కే.శ్రీవికాస్, కే.వైష్ణవి జాతీయ స్థాయి కళా ఉత్సవ్(జాతీయస్థాయి) పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను ఈరోజు కలెక్టర్ పమేలా సత్పత్తి కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.

News November 12, 2025

సాతాపూర్ విద్యార్థుల ప్రమాద ఘటన.. హెచ్ఎం సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం

image

పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సీరియస్ అయ్యారు. విద్యార్థులను పాఠ్యపుస్తకాలు తీసుకురావడానికి పంపించడంపై ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలంను సస్పెండ్ చేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

News November 12, 2025

IPL: ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది వీరినేనా?

image

CSK: శంకర్, కాన్వే, హుడా, అశ్విన్, త్రిపాఠి
DC: ముకేశ్, చమీర, నటరాజన్, మోహిత్, డుప్లెసిస్
GT: రషీద్, షారుక్, ఇషాంత్, Tewatia
KKR: V iyer, అలీ, డికాక్, రమణ్‌
LSG: షమర్, సమద్, MI: D చాహర్, Topley, ముజీబ్
PBKS: Maxy, స్టొయినిస్, Ferguson, Jamieson
RR: మధ్వాల్, ఫారూఖీ, బర్గర్, తీక్షణ, Hetmyer, తుషార్
SRH: Ishan, shami, జంపా, అభినవ్, R చాహర్, హర్షల్
RCB: పడిక్కల్, షెపర్డ్, రసిఖ్, సుయాశ్, లివింగ్‌స్టోన్