News November 11, 2025

రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్‌ AMG G63 వ్యాగన్‌ మోడల్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్‌తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.

Similar News

News November 12, 2025

మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

image

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.

News November 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 12, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 12, 2025

పాక్ ఆరోపణలు నిరాధారమైనవి: విదేశాంగ శాఖ

image

ఇస్లామాబాద్‌లో <<18261233>>దాడి<<>> వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఆయనవి నిరాధారమైన ఆరోపణలు అని మండిపడ్డారు. ఆ దేశంలోని సైనిక పాలన తరహా విధ్వంసం, అధికార దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు వాస్తవం ఏంటో తెలుసని, పాక్ కుట్రల ద్వారా తప్పుదోవ పట్టవని తెలిపారు.