News November 11, 2025
జేఎన్ఎస్‌లో రెండో రోజు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

HNK జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ రెండో రోజు కొనసాగింది. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 562 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా 800 మంది ఉత్తీర్ణులయ్యారు. సోమవారం పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది.
Similar News
News November 12, 2025
మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.
News November 12, 2025
జగిత్యాల: ముద్రా లోన్ ద్వారా 34,249 మందికి రూ.285 కోట్ల లబ్ధి

జగిత్యాల కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా దిశా కమిటీ సమావేశం జరిగింది. ముద్రా లోన్ పథకంలో జిల్లాకు రూ.285 కోట్లు మంజూరై 34,249 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని అధికారులు తెలిపారు. రూ.50వేల నుంచి రూ.20లక్షల వరకు జామీను లేకుండా లోన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల తిరస్కరణలకు గురవుతున్నారని తెలిపారు.
News November 12, 2025
జగిత్యాల: గొర్రెపల్లి శివారులో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగళారపు లక్ష్మీనర్సయ్య(43) గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


