News November 11, 2025
రెవెన్యూ సదస్సు దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో రోజుకు కనీసం 50 దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా వేగంగా పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవోలు రాథోడ్ రమేష్ ఉన్నారు.
Similar News
News November 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 12, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 12, 2025
పాక్ ఆరోపణలు నిరాధారమైనవి: విదేశాంగ శాఖ

ఇస్లామాబాద్‌లో <<18261233>>దాడి<<>> వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఆయనవి నిరాధారమైన ఆరోపణలు అని మండిపడ్డారు. ఆ దేశంలోని సైనిక పాలన తరహా విధ్వంసం, అధికార దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు వాస్తవం ఏంటో తెలుసని, పాక్ కుట్రల ద్వారా తప్పుదోవ పట్టవని తెలిపారు.
News November 12, 2025
‘మనోబంధు’కు సహకరిస్తాం: SP

మనోబంధు కార్యక్రమానికి పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మనోబంధు కార్యక్రమం నిర్వహణ కరపత్రాలను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మానసిక రుగ్మతలతో బాధపడుతూ వీధుల్లో సంచరిస్తున్న వారికి వైద్యం అందించి కుటుంబీకుల చెంతకు చేర్చడం జరుగుతుందన్నారు.


