News November 11, 2025

ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్​ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్​

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్​, అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/

Similar News

News November 12, 2025

మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

image

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.

News November 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 12, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 12, 2025

పాక్ ఆరోపణలు నిరాధారమైనవి: విదేశాంగ శాఖ

image

ఇస్లామాబాద్‌లో <<18261233>>దాడి<<>> వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఆయనవి నిరాధారమైన ఆరోపణలు అని మండిపడ్డారు. ఆ దేశంలోని సైనిక పాలన తరహా విధ్వంసం, అధికార దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు వాస్తవం ఏంటో తెలుసని, పాక్ కుట్రల ద్వారా తప్పుదోవ పట్టవని తెలిపారు.