News November 11, 2025
బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్‌లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..
Similar News
News November 12, 2025
‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.
News November 12, 2025
18 రోజులు.. ఈసారి మహాభారతమే

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.
News November 12, 2025
పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.


