News November 12, 2025
రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం: మంత్రి

విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 30 మంది విదేశీ మంత్రులు పాల్గొననున్నారని చెప్పారు. మొత్తం 410 ఒప్పందాల ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
Similar News
News November 12, 2025
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి: DSP

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News November 11, 2025
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.
News November 11, 2025
సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్‌రావు

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్‌రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్‌గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.


