News April 12, 2024
ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

ఓటర్ల చేతి వేలికి వేసే సిరాను కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేస్తారు. దీని తయారీ ఫార్ములా రహస్యంగా ఉంటుంది. అక్కడ పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఫార్ములా తెలుస్తుంది. వారు తమ రిటైర్మెంట్ సమయంలో నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు దానిని బదిలీ చేస్తారు. ఈసారి ఎన్నికల్లో ₹55కోట్ల విలువైన 26.55 లక్షల ఇంక్ వయల్స్‌ను వినియోగించనున్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 21, 2026
నేటి ముఖ్యాంశాలు

* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం
* నితిన్ నా బాస్.. నేను కార్యకర్తను మాత్రమే: మోదీ
* దావోస్‌లో గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
* ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలపాటు హరీశ్ రావును విచారించిన సిట్
* హరీశ్ విచారణపై INC-BRS నేతల మధ్య డైలాగ్ వార్
* పెండింగ్ చలాన్లపై బలవంతం చేయొద్దు: TG హైకోర్టు
* ఇవాళ రూ.22వేలు పెరిగిన కేజీ వెండి ధర, రూ.1.52లక్షలకు చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
News January 21, 2026
మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.
News January 21, 2026
ముంబైపై ఢిల్లీ ఘన విజయం

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.


