News April 12, 2024
బీర్కూర్ : సీడ్ సక్రమంగా లేకనే పంట రాలేదు :అవినాష్ రెడ్డి

బీర్కూర్ మండల కేంద్రంలో పంట నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించామని సీడ్ సక్రమంగా లేకనే రైతులకు పంట నష్టం జరిగిందని కిసాన్ కేత్ రాష్ర్ట అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో ఆయన మాట్లాడారు. బీర్కూర్‌లోని గ్రోమోర్‌కు చెందిన ఓ షాప్లో ఆర్కె సోనా విత్తనం రైతులకు అమ్మారని, ఈ సీడ్ సక్రమంగా లేక పంట రాలేదన్నారు.
Similar News
News September 10, 2025
నిజామాబాద్: వృద్ధురాలి హత్య

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 10, 2025
NZB: కళాశాలకు హాజరు కాని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: DIEO

ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్‌లోనే హాజరు తీసుకోవాలని DIEO తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల, బోధనేతర సిబ్బందితో సమీక్షించారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కానీ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News September 10, 2025
NZB: వాగులో గుర్తు తెలియని మృతదేహం

నిజామాబాద్ బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వారు 4వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 35-40 ఉంటుందని పోలీసులు చెప్పారు. కాగా మృతుడు ఆత్మహత్య చేసుకొన్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.