News April 12, 2024

మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందే: హైకోర్టు

image

సాధారణంగా విడాకుల తర్వాత భార్యలకు భర్తలు భరణం ఇవ్వడం గురించి వింటుంటాం. తాజాగా భరణం విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంపాదించే మహిళ.. అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు భరణం చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు మేనేజర్‌ అయిన ఓ మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించలేనని వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు నెలకు రూ.10వేల భరణం చెల్లించాలంది.

Similar News

News February 21, 2026

ALERT: మూడ్రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ఉన్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 21, 2026

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.

News February 21, 2026

సునీతా విలియమ్స్ యాత్ర.. అప్పుడేమైంది?

image

నాసా రిపోర్టు ప్రకారం.. 2024 జూన్‌లో వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లగానే దానిని నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్య వచ్చింది. ISSకు చేరుకునే సరికి 5 థ్రస్టర్లు/మినీ ఇంజిన్లు పని చేయడం ఆగిపోయాయి. హీలియం లీకేజ్ మొదలైంది. అయితే డాకింగ్ జరగడంతో వ్యోమగాములు ISSలోకి వెళ్లగలిగారు. స్టార్ లైనర్‌ను ఖాళీగానే కిందికి తీసుకొచ్చారు. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ నౌకలో సునీత, విల్మోర్ భూమికి చేరుకున్నారు.