News April 12, 2024
ఈనెల 16న PUలో మహనీయుల జయంతి

ఈనెల 16న పాలమూరు విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. నాగం కుమారస్వామి తెలిపారు. వర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, భారత రత్న డా. బీఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పులే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
News March 14, 2026
MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
News March 13, 2026
MBNR: పదో తరగతి పరీక్షలు.. జిల్లా విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను 83747 72282ను సంప్రదించాలని డీఈవో ప్రవీణ్ కుమార్ సూచించారు.


