News April 12, 2024

చీరాల: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

image

ఇంట్లో వారు మందలించారనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చీరాల మండలం వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఎం.నాగేంద్ర(23) చీరాలలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 9, 2025

ప్రకాశం SP మీకోసం కార్యక్రమానికి 49 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 49 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ-కోసం కార్యక్రమానికి పోలీస్ అధికారులు హాజరై ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదుల తీవ్రతను వివరించారు.

News September 8, 2025

యూరియా లోటు లేదు: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో యూరియా లోటులేదనే విషయాన్ని రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో వర్చువల్‌గా కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా లోడ్ మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన వచ్చే అనర్థాల గూర్చి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించేలా కృషి చేయాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు.

News September 8, 2025

ఒంగోలు: యువతిపై లైంగిక దాడికి యత్నం

image

ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో అతడు దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొత్తపట్నం పోలీసులు గాలించి అతడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.