News April 12, 2024
సింహాచలం: ఆ వాహనాలకు మాత్రమే అనుమతి

వచ్చే నెల 10న జరగనున్న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి అధికారిక ప్రొటోకాల్ పరిధిలోని వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. తొలిపావంచా నుంచి భక్తులను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో కొండపైకి తరలిస్తారు. నగర పరిధిలోని ఆరు ఏడు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రొటోకాల్ వుండదు.
Similar News
News October 6, 2025
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతుంది

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతోందని జీవీఎంసీ అదనపు కమిషన్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకర్‌రావు తెలిపారు. దసరా సందర్భంగా ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక విరామం ఇచ్చారు. పలువురు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకున్నప్పటకీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగిచేందుకు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
News October 6, 2025
విశాఖ: ఏ జోన్‌లో ఎంతమంది వర్తకులున్నారంటే?

ఇటీవల యూసీడీ (UCD) విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీలోని వీధి వర్తకుల సర్వే పూర్తయింది. ఎనిమిది జోన్‌ల పరిధిలో 18,041 మంది వ్యాపారులను గుర్తించారు. జోన్-1 పరిధిలో 217 మంది, జోన్-2లో 2,965, జోన్-3లో 3,615, జోన్-4లో 2,879, జోన్-5లో 3,510, జోన్-6లో 2,152, జోన్-7లో 154, జోన్-8లో 2,549 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. <<17922542>>వెండింగ్ జోన్ల<<>>ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
News October 6, 2025
5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.