News November 12, 2025

భారత్‌కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

image

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 12, 2025

ఉప్పల్: అంధ విద్యార్థుల పరీక్షలకు వాలంటీర్లు కావాలి

image

చిన్నజీయర్‌ ఆశ్రమంలో డిగ్రీ మొదటి సంవత్సరం అంధ విద్యార్థుల పరీక్షలకు స్రైబ్‌ల కోసం వాలంటీర్లు కావాలని కోరారు. సంస్కృతం చదవగలిగే, తెలుగులో నిర్దోషంగా రాయగల 20 మంది వాలంటీర్లు కావాలని తెలిపారు. ఈ నెల 14న ఉ.9-12 వరకు, మ.2- 5 వరకు జరిగే రెండు పరీక్షా సెషన్లకు స్రైబ్‌లుగా సేవలందించాలని వివరించారు. ఉప్పల్‌ నుంచి ఉచిత నుంచి బస్‌ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలకు 9032521741లో సంప్రదించాలన్నారు.

News November 12, 2025

జూబ్లీహిల్స్ పోలింగ్.. ఫైనల్ లెక్క ఇదే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేశాయి.

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.