News April 12, 2024

బీజేపీకి షాక్.. పార్టీని వీడిన పాలమూరు ముఖ్యనేతలు

image

పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. MBNR పార్లమెంట్ పరిధిలో బీజేపీకి NRPT, మక్తల్లోనే మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్న తరుణంలో నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగపాండురెడ్డి, జలంధర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ అలీ తమ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గురువారం అందజేశారు. 

Similar News

News January 6, 2025

MBNR: నట్టేట ముంచారు.. అరుణ వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి ఆశ చూపి.. ప్రజలను రేవంత్‌రెడ్డి నట్టేట ముంచారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12 వేలకు కుదించటమేంటని ప్రశ్నించారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. పాలన చేతకాకుంటే పదవి నుంచి దిగిపోవాలని పేర్కొన్నారు.

News January 6, 2025

మహబూబ్‌నగర్‌: ఉరేసుకుని ఇద్దరి ఆత్మహత్య

image

ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వేర్వేరు కారణాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. మల్దకల్‌కు చెందిన కుమ్మరి నర్సింహులు(42) గద్వాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారు. వారు లోన్ చెల్లించాలని ఒత్తిడి తేవటంతో ఈ నెల 3న ఉరేసుకున్నారు. నందివడ్డెమాన్‌కి చెందిన చెన్నయ్య(45) ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

News January 6, 2025

మహబూబ్‌నగర్: స్థానిక పోరుకు సన్నద్ధం..!

image

ఉమ్మడి MBNR జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.