News April 12, 2024

ఓటీటీలోకి వచ్చేసిన 3 కొత్త సినిమాలు

image

మూడు కొత్త సినిమాలు ఇవాళ ఓటీటీలో విడుదలయ్యాయి. విశ్వక్‌సేన్ అఘోరాగా నటించిన ‘గామి’ జీ5లో అందుబాటులోకి రాగా, శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. వీటితో పాటు యూత్‌ను బాగా ఆకట్టుకున్న డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’ తెలుగు వర్షన్ ఆహాలో, మిగతా భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Similar News

News March 13, 2026

ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

image

AP: ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.

News March 13, 2026

విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

image

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <>వెబ్‌సైట్‌<<>> ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 16న నోటిఫికేషన్ రానుంది. 18వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

News March 13, 2026

మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

image

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.