News November 13, 2025
పాలమూరు: నేడు.. U-14 ‘క్రికెట్’ ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 బాలురకు క్రికెట్ జట్ల ఎంపికలను MDCA స్టేడియంలో(సత్యం కాలనీ పిల్లలమర్రి రోడ్) నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 13న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ అబ్దుల్లాకు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT
Similar News
News November 13, 2025
ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News November 13, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్

TG: విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ ఇవాళ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు WADUPSA పిలుపునిచ్చింది. HNK, వరంగల్, BHPL, జనగాం, ములుగు, MHBD జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని కోరింది. విద్యార్థి సంఘాల నాయకులు చందాలకు వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడికి దిగడంపై హనుమకొండ PSలో ఫిర్యాదు చేసింది. ఈ చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది.
News November 13, 2025
నేటి నుంచి సత్యసాయి శతజయంతి వేడుకలు

AP: నేడు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏటా NOV 18 నుంచి ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ కాగా శతజయంతి కావడంతో ఐదు రోజుల ముందు నుంచే నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రశాంతి నిలయంలో నారాయణ సేవను ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో 19న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, 22న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్సవాల్లో పాల్గొంటారు.


