News November 13, 2025
17కు చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్ వాయిదా

కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ ఈనెల 17కు వాయిదా పడింది. నెల్లూరు సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరగ్గా.. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందనన్నారు. మరో వైపు సీబీఐ అధికారులు సైతం కస్టడీ పిటిషన్ వేశారు. 17న కస్టడీ లేదా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
Similar News
News November 13, 2025
కామారెడ్డి: ఈ ప్రాణాంతక డ్రైవింగ్‌కు అడ్డుకట్టే వేయరా?

సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారిపై వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ అపసవ్య దిశలో ప్రయాణించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా ప్రయాణించే రహదారిపై వాహనదారులు అడ్డంగా రావడంతో ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ అజాగ్రత్త కారణంగా ప్రాణనష్టం, గాయాలపాలవుతున్నారు. అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.
News November 13, 2025
కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు త్వరలో ఆన్‌లైన్ టెస్ట్.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు, మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్, ఆపై చదివిన 1.90 లక్షల మందికి పైగా నిరుద్యోగులను (NTRలో 1.30 లక్షలు, కృష్ణాలో 60 వేలు)గా గుర్తించారు. త్వరలో ఆయా కంపెనీల ప్రతినిధులే సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల ప్రతిభ, అనుభవాన్ని బట్టి ప్యాకేజీలు ఉంటాయని అధికారులు తెలిపారు.
News November 13, 2025
MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. నేడే లాస్ట్!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’కు తెలిపారు. లేడీస్ టైలరింగ్ కోర్సులలో ఈనెల 14 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వయసు 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 99633 69361 సంప్రదించాలన్నారు.
#SHARE IT


