News November 13, 2025
రేపటి తరానికి మార్గదర్శనం మన అలవాట్లే

మంచి అలవాట్లు మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి, ఇంట్లో పిల్లలకు ఆదర్శంగా ఉంటాయి. ఓ వ్యక్తి ఆఫీస్ సమయానికి 20 నిమిషాల ముందు లేచి, హడావిడిగా సిద్ధమయ్యేవాడు. కొన్నాళ్లకు అతడి కుమారుడు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. మనం నేర్పించే ప్రతి పాఠం, మన నడవడిక నుంచే మొదలవుతుంది. అందుకే, మన అలవాట్లు మనల్నే కాక, మన తర్వాత తరాలను కూడా ప్రభావితం చేస్తాయని మరువకూడదు. మంచి అలవాట్లే నిజమైన వారసత్వం. <<-se>>#Jeevanam<<>>
Similar News
News November 13, 2025
ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.
News November 13, 2025
నానబెట్టిన మెంతులు మంచివేనా?

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
News November 13, 2025
టుడే..

* ఢిల్లీలో ఇండో-యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం
* AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్.. నేటి నుంచి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
* రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్


