News November 13, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్

TG: విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ ఇవాళ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు WADUPSA పిలుపునిచ్చింది. HNK, వరంగల్, BHPL, జనగాం, ములుగు, MHBD జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని కోరింది. విద్యార్థి సంఘాల నాయకులు చందాలకు వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడికి దిగడంపై హనుమకొండ PSలో ఫిర్యాదు చేసింది. ఈ చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది.
Similar News
News November 13, 2025
సీఎం, పీఎంను తొలగించే బిల్లు.. జేపీసీలో మన ఎంపీలకూ చోటు

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం <<18272673>>ఏర్పాటు<<>> చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి చోటు దక్కింది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాయి.
News November 13, 2025
కేసీఆర్‌పై జనవరి 19 వరకు చర్యలొద్దు: HC

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా KCRపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. వచ్చే ఏడాది JAN 19 వరకు ఆయనతోపాటు హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి 4 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను JAN 19కి వాయిదా వేసింది.
News November 13, 2025
స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. 2,3 రోజుల్లో క్లారిటీ

TG: రేపటితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగియనుండటంతో లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై 2,3 రోజుల్లో CM రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. రిజర్వేషన్లను కోర్టు అంగీకరించకపోతే పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లనుంది.


