News November 13, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ఇస్రో <<>>సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

Similar News

News November 13, 2025

మార్నింగ్ అప్డేట్స్

image

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

News November 13, 2025

రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

image

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.

News November 13, 2025

టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

image

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్‌లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్‌లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్‌లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్‌తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.