News November 13, 2025
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర అభివృద్ధిలో భాగంగా Y జంక్షన్ నుంచి జంపన్న వాగు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్, ప్లాంటేషన్ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో పర్యటించిన మంత్రి, జాతర సమీపిస్తున్నందున పనుల వేగాన్ని పెంచాలన్నారు.
Similar News
News November 13, 2025
నేటి నుంచే అరకు-యెలహంకా ప్రత్యేక ట్రైన్లు

నేటీ నుంచే దువ్వాడ మీదుగా అరకు-యెలహంకా మధ్య స్పెషల్ ట్రైన్‌లు (08551/08552), (08555/08556) నడవనున్నాయి. ఈనెల 13, 17, 23, 24 తేదీల్లో అరకు నుంచి మ.12కి స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది. తిరుగుపయనం ఈనెల 14, 24, తేదీల్లో యెలహంకా నుంచి మ.1.30 గంటకి, అదేవిధంగా 18, 25 తేదీల్లో యలహంక నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
News November 13, 2025
రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.
News November 13, 2025
భీమేశ్వరాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 22వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫొటోను అందజేశారు.


