News November 13, 2025
HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

రేపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్‌లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్‌పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్‌తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.
Similar News
News November 13, 2025
VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 13, 2025
హనుమకొండ: స్కాలర్ షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి తెలిపారు. అర్హులైన ఈబీసీ, బీసీ విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో డిసెంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 13, 2025
చెర్వుగట్టుపై మరింత ఫోకస్

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ఇన్‌ఛార్జ్ ఈవో మోహన్ బాబు ఫోకస్ పెట్టారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులతో పాటు సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యేలా ఫేషియల్ అటెండెన్స్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో వ్యర్థాలు, చెత్త, పిచ్చిమొక్కలను తొలగించేందుకు ఇక ప్రతి గురువారం మన గుడి.. స్వచ్ఛత పరిశుభ్రత నిర్వహించనున్నారు.


