News November 13, 2025

కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు త్వరలో ఆన్‌లైన్ టెస్ట్.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు, మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్, ఆపై చదివిన 1.90 లక్షల మందికి పైగా నిరుద్యోగులను (NTRలో 1.30 లక్షలు, కృష్ణాలో 60 వేలు)గా గుర్తించారు. త్వరలో ఆయా కంపెనీల ప్రతినిధులే సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల ప్రతిభ, అనుభవాన్ని బట్టి ప్యాకేజీలు ఉంటాయని అధికారులు తెలిపారు.

Similar News

News November 13, 2025

NZB: ‘బయటకు రావాలంటే భయమైతుంది’

image

NZB, KMR జిల్లాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట కుక్కకాటు ఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని, కుక్కల బెడదతో బయటకు రావాలంటేనే భయమైతోందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలపై దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. తాజాగా మాచారెడ్డి(M) చుక్కాపూర్‌లో వీధి కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. మీ ప్రాంతంలో కుక్కల బెడద ఉందా కామెంట్ చేయండి.

News November 13, 2025

ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

image

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.

News November 13, 2025

VJA: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

image

తల్లిదండ్రులు మరణించడంతో మానసిక వేదనతో నెల్లూరు నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్న 19 ఏళ్ల యువతికి ఆటో డ్రైవర్లు అండగా నిలిచారు. ఆకలితో అలమటిస్తున్న ఆమెకు ఆహారం ఇచ్చి, కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను సురక్షిత కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ల మానవత్వాన్ని పలువురు అభినందించారు.