News November 13, 2025

VKB: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి!

image

వికారాబాద్‌ జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) పొందడానికి వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

image

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.

News November 13, 2025

VJA: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

image

తల్లిదండ్రులు మరణించడంతో మానసిక వేదనతో నెల్లూరు నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్న 19 ఏళ్ల యువతికి ఆటో డ్రైవర్లు అండగా నిలిచారు. ఆకలితో అలమటిస్తున్న ఆమెకు ఆహారం ఇచ్చి, కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను సురక్షిత కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ల మానవత్వాన్ని పలువురు అభినందించారు.

News November 13, 2025

మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

image

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.