News November 13, 2025

జూబ్లీహిల్స్ ఓటింగ్ వివరాలు

image

☛మొత్తం ఓటర్లు: 4,01,365
Male: 2,08,561
Female: 1,92,779
Others: 25
☛పోలైన ఓట్లు: 1,94,631
Male: 99,771
Female: 94,855
Others: 5
Polling Percentage: 48.49%

Similar News

News November 13, 2025

జూబ్లీహిల్స్‌: పైసలిచ్చినా ఓటెయని వారి నుంచి వసూళ్లు!

image

జూబ్లీహిల్స్ ఓటింగ్ అందరినీ నిరాశకు గురిచేసింది. పోలింగ్ 50% నమోదు కాకపోవడంతో అసహనం వ్యక్తం అవుతోంది. డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయని వారి ఇళ్లకు నాయకులు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అపార్ట్‌మెంట్‌లో ఉండే సగం మంది బయటకు రాలేదని గుర్తించిన బూత్ కమిటీ సభ్యులు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు సమాచారం.

News November 13, 2025

HYD: ఔర్‌కుచ్ బాకీ హే క్యా?.. BRS మీద INC ట్రోల్స్

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ నాయకులు BRS మీద ట్రోల్స్ మొదలుపెట్టారు. ‘ఎవ్వడికి వాడు కొడుతున్నాం.. కొడుతున్నాం అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్‌లో కొట్టాం. పార్లమెంట్ ఎలక్షన్స్‌‌లో కొట్టాం. కంటోన్మెంట్ బైఎలక్షన్‌లో కొట్టాం. జూబ్లీహిల్స్‌లో కొడుతున్నాం. ప్రతిసారి కొట్టేది మేము అయితే కొట్టించుకునేది మీరు’ అంటూ BRSను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు SMలో ట్వీట్ చేస్తున్నారు.

News November 13, 2025

జూబ్లీహిల్స్: రేపు వైన్స్ బంద్

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్‌లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వైన్స్ తెరుచుకోనున్నాయి. SHARE IT