News April 12, 2024

భీమిలి: పాఠాలు చెబుతా మరణించిన టీచర్

image

భీమిలి మండలం తగరపువలసలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మజ్జి రాజేష్ కుమార్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోలేదు. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పేవాడు. గురువారం తరగతి గదిలో పాఠాలు చెబుతూ నోటి నుంచి నురగలు కక్కుకుంటు కుప్పకూలి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 24, 2026

సాధార‌ణ భ‌క్తులకు పెద్దపీట వేస్తూ చంద‌నోత్స‌వం: మంత్రి డోలా

image

సాధార‌ణ భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ సింహాచ‌లం చంద‌నోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేయాలన్నారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులూ త‌లెత్త‌కుండా ఉచిత‌, రూ.300, రూ.1,000, రూ.1,500 టిక్కెట్లకు క్యూ‌లైన్ల‌ను ఏర్పాటు చేస్తునట్టు కలెక్టర్ తెలిపారు.

News March 24, 2026

విశాఖ: ట్రాన్స్‌జెండర్‌లకు CNG ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

image

విశాఖ పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్‌లో అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లకు CNG ఆటోలు పంపిణీ చేశారు. అదేవిధంగా ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.

News March 24, 2026

సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

సింహాచలం వార్షిక చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిని ఆయన ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.