News November 13, 2025
ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.
Similar News
News March 19, 2026
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఖరారు

ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ.. జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు. వీరితో పాటు 5 మంది అధికార ప్రతినిధులు, 15 మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు.
News March 19, 2026
ఖమ్మం జిల్లాలో రహదారుల విస్తరణకు రూ.594 కోట్లు

ఖమ్మం జిల్లాలో గురువారం 5 కీలక రహదారుల విస్తరణకు రూ.594 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో వైరా-జగ్గయ్యపేట, మధిర-తూటికుంట్ల, మధిర-ఎర్రుపాలెం, ఖమ్మం-బోనకల్ మార్గాలు 4 లైన్లుగా అభివృద్ధి కానున్నాయి. గ్రామాలు-పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగై రవాణా సౌకర్యాలు పెరగడంతో రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది.