News November 13, 2025
పాలమూరులో నేడు ‘నెట్ బాల్’ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల బాలికలకు నేడు నెట్ బాల్ ఎంపికలు నిర్వహించనున్నారు. స్థానిక DSA ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ మెమో (U-19), బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలలోపు పీడీ జ్యోతికి రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.
Similar News
News November 13, 2025
రండి.. ట్రైనింగ్ ఇచ్చి వెళ్లిపోండి: అమెరికా

H1B వీసా విధానంపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన కామెంట్లు చేశారు. ‘విదేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం తాత్కాలికంగా విదేశీ కార్మికులను యూఎస్ తీసుకురావడమే H1B వీసా కొత్త విధానం. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. తరువాత తిరిగి వెళ్లిపోండి. జాబ్స్ అన్నీ అమెరికన్లే తీసుకుంటారు’ అని చెప్పారు.
News November 13, 2025
కట్టంగూర్: వెయ్యి కొట్టు.. ఫ్లాట్ పట్టు

ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టంగూర్‌కు చెందిన మేకల రమేష్.. ‘వెయ్యి కొట్టు ప్లాటు పట్టు’ అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో 147 గజాల ప్లాట్ లక్కీ డ్రా తరహాలో బేరానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
News November 13, 2025
టెన్త్ పరీక్షలు అప్పుడేనా?

TGలో పదో తరగతి పరీక్షలు 2026 మార్చి 18(బుధవారం) నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు అదే రోజు ముగియనుండగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ప్రభుత్వం ఆమోదిస్తే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అటు టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని TGHMA విద్యాశాఖను కోరింది.


