News April 12, 2024

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థిపై కేసు నమోదు

image

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రమణయ్యపేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేయగా.. నానాజీతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సర్పవరం SI శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. జనసేన నేతలు ఆరుగురు వాలంటీర్లను గదిలో నిర్భంధించి తాళం వేసి, దురుసుగా ప్రవర్తించారని అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 6, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ కీర్తి

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈనెల 6న జిల్లాలో యథాతధంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు. పాత అర్జీల పరిష్కార స్థాయి తెలుసుకోవడానికి 1100కు ఫోన్ నంబర్‌కి చేయాలన్నారు.

News October 5, 2025

అక్టోబర్ 6న అవార్డుల ప్రదానోత్సవం

image

జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా” అవార్డుల ప్రదానోత్సవాన్ని అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఆదివారం తెలిపారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జేసీ ఆదేశించారు.

News October 5, 2025

దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అందులో భాగంగా ఈనెల 3 నుంచి మరో ఐదు గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం కోరుకొండ మండలం నర్సింహాపురం అగ్రహారం గ్రామంలో రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 190 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు.