News November 13, 2025

WGL: అన్యాయం అంతరిస్తే ‘నా గొడవ’కు ముక్తి..!

image

‘అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’ అంటూ ప్రజల గొడవను తన గొడవగా చెప్పిన మానవీయ కవి, ప్రజా కవి కాళోజీ నారాయణరావు. అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, సంపదల్ని ఒకచోట గంపెడు బలగం ఒకచోట అంటూ, సమసమాజ నిర్మాణానికి తన కవితలతో కదం తొక్కిన ఉద్యమవీరుడు ఆయన. కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు.
#నేడు కాళోజీ వర్ధంతి.

Similar News

News November 13, 2025

ఆ సినిమాలు చూసి నన్ను చంపాలనుకున్నారు: అదా శర్మ

image

రిస్క్ ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని, నటించినప్పుడే కెరీర్‌కు విలువ పెరుగుతుందని హీరోయిన్ అదా శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ది కేరళ స్టోరీ, బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలు రిలీజైన తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగిలిన వారు ప్రశంసించారు. వాళ్లే నన్ను కాపాడారు. నేను యాక్షన్, భావోద్వేగం, రిస్క్ ఉన్న స్క్రిప్ట్‌నే ఎంపిక చేసుకుంటా’ అని చెప్పారు.

News November 13, 2025

జూబ్లీబైపోల్: డివిజన్ల వారీగా ఓటింగ్ వివరాలు

image

1.షేక్‌పేట్ ఓటర్లు 71,062, పోలైన ఓట్లు 31,182(43.87%)
2.రహమత్‌నగర్ ఓటర్లు 74,387 పోలైన ఓట్లు 40,610(54.59%)
3.యూసుఫ్‌గూడ ఓటర్లు 55,705, పోలైన ఓట్లు 24219(43.47%)
4.ఎర్రగడ్డ ఓటర్లు 58,752, పోలైన ఓట్లు 29,112(49.55)
5.బోరబండ ఓటర్లు 53,211, పోలైనవి 29,760 (55.92%)
6.వెంగళ్‌రావునగర్ ఓటర్లు 53,595, పోలైన ఓట్లు 25,195(47.00%)
7.సోమాజిగూడ(PART) ఓటర్లు 34,653, పోలైన ఓట్లు14,553( 41.99%)

News November 13, 2025

రూ.13 కోట్లతో ధ్యాన కేంద్రం: మంత్రి సీతక్క

image

ప్రఖ్యాత రామప్ప సరస్సులోని దీవిలో కేంద్ర నిధులతో రూ.13 కోట్లతో ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 7 ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన ముద్రలో ఉన్న శివుని భారీ విగ్రహంతో సహా మెడిటేషన్ సెంటర్‌ను నిర్మించే పనులను సీతక్క ప్రారంభించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.