News November 13, 2025

HNK: కేజీబీవీల అభివృద్ధికి నిధుల మంజూరు!

image

జిల్లాలోని 9 కేజీబీవీల్లో పలు అభివృద్ధి పనులకు నిధుల కోసం పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ధర్మసాగర్, శాయంపేట, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపూర్ కేజీబీవీలకు ఒక్కో దానికి రూ.38.152 లక్షలు, ఐనవోలు కేజీబీవీకి 130.52 లక్షలు, భీమదేవరపల్లి కేజీబీవీకి 101.052 లక్షలు, వేలేరు కేజీబీవీకి 128.650 లక్షలు, ఆత్మకూరు కేజీబీవీకి 143.954 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో కేజీబీవీల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

Similar News

News November 13, 2025

బోథ్: రెండు రోజులు సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

image

AMC బోథ్ మార్కెట్‌లో సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ మార్కెట్‌లో అధిక మొత్తంలో పంట నిల్వ ఉండడంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 17 నుంచి యధావిధిగా కొనుగోళ్లు చేపడతామని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.

News November 13, 2025

NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

image

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.

News November 13, 2025

పెద్దిరెడ్డి భూములపై విచారణకు పవన్ ఆదేశం..!

image

మంగళం పేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్‌పై నివేదిక తయారు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న అమరావతిలో అధికారులతో మాట్లాడారు. వారసత్వంగా వచ్చిన భూములు క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చాయని, ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారట. ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, విచారించిన ఫైల్స్‌ను పంపినట్లు సమాచారం.