News November 13, 2025

జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు..!

image

జిల్లా రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ గురించి సరిగా తెలియకపోవడం, తెలిసినా అందులో ఫార్మర్ నాట్ రిజిస్టర్ అని చూపించడం, ఎవరి పేరు మీద ఎంత పత్తి ఉందో, ఎంత వరి ఉందో తెలియకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకొని వారికి వెంటనే రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.

Similar News

News November 13, 2025

NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

image

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.

News November 13, 2025

పెద్దిరెడ్డి భూములపై విచారణకు పవన్ ఆదేశం..!

image

మంగళం పేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్‌పై నివేదిక తయారు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న అమరావతిలో అధికారులతో మాట్లాడారు. వారసత్వంగా వచ్చిన భూములు క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చాయని, ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారట. ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, విచారించిన ఫైల్స్‌ను పంపినట్లు సమాచారం.

News November 13, 2025

HYD: బిజీ లైఫ్ వల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్!

image

HYDలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, నిద్రలేమి, పొగతాగటం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా మెదడుపై తీవ్రంగా ప్రభావంపడుతున్నట్లుగా సీనియర్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ తెలిపారు. HYDలో NIMS ఆసుపత్రికి నెలకు 250 నుంచి 300 కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత, యోగా, ధ్యానం, ప్రకృతితో గడపడం లాంటివి చేయాలని సూచించారు.
SHARE IT