News November 13, 2025
భీమేశ్వర సదన్‌కు మారిన ఆలయ EO ఆఫీస్

వేములవాడ రాజన్న ఆలయ ఈవో కార్యాలయం భీమేశ్వర సదన్‌కు మారింది. 60 ఏసీ గదులున్న ఈ సముదాయంలోని ఆరు గదులలో ఈవో ఆఫీస్, అకౌంట్స్ విభాగం, మనీ వ్యాల్యూ(టికెటింగ్) తదితర విభాగాలను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వరండాలోని రిసెప్షన్ గది స్థానంలో ఇంజినీరింగ్ డిపార్ట్మెంటును నెలకొల్పారు. దీంతో భక్తుల కోసం ప్రస్తుతం 54 గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, పాత EO కార్యాలయాన్ని కూల్చేయడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.
Similar News
News November 13, 2025
బోథ్: రెండు రోజులు సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

AMC బోథ్ మార్కెట్‌లో సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ మార్కెట్‌లో అధిక మొత్తంలో పంట నిల్వ ఉండడంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 17 నుంచి యధావిధిగా కొనుగోళ్లు చేపడతామని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.
News November 13, 2025
NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.
News November 13, 2025
పెద్దిరెడ్డి భూములపై విచారణకు పవన్ ఆదేశం..!

మంగళం పేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్‌పై నివేదిక తయారు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న అమరావతిలో అధికారులతో మాట్లాడారు. వారసత్వంగా వచ్చిన భూములు క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చాయని, ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారట. ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, విచారించిన ఫైల్స్‌ను పంపినట్లు సమాచారం.


