News November 13, 2025

VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

image

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News March 8, 2026

VZM: ప్రైవేట్ బస్సు, స్కూటీ ఢీ.. వ్యక్తి మృతి

image

అయినాడ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. విజయనగరంలోని బాబామెట్టకు చెందిన అప్పారావు(64)ను అయినాడ జంక్షన్ వద్ద చింతల వలస వైపు స్కూటీ‌తో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావు తలకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108లో విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డెంకాడ ఎస్సై సన్యాసి నాయుడు తెలిపారు.

News March 8, 2026

VZM: రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

విజయగరం జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
➤VZM–సంబల్‌పూర్ 3వ లైన్ పనులకు వారంలో విత్‌డ్రావల్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశం ➤కొత్తవలస–VZM 4వ లైన్ పనులకు గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
➤ఖుర్దా రోడ్–VZM 3వ లైన్‌కు స్ట్రక్చర్ వ్యాల్యూయేషన్ రిపోర్టులు సిద్ధం చేయాలని ఆదేశం
➤జిల్లాలో మంజూరైన 17 ROB పనులపై ఆరా

News March 8, 2026

VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్‌లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.