News November 13, 2025
జూబ్లీహిల్స్: పైసలిచ్చినా ఓటెయని వారి నుంచి వసూళ్లు!

జూబ్లీహిల్స్ ఓటింగ్ అందరినీ నిరాశకు గురిచేసింది. పోలింగ్ 50% నమోదు కాకపోవడంతో అసహనం వ్యక్తం అవుతోంది. డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయని వారి ఇళ్లకు నాయకులు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అపార్ట్‌మెంట్‌లో ఉండే సగం మంది బయటకు రాలేదని గుర్తించిన బూత్ కమిటీ సభ్యులు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు సమాచారం.
Similar News
News November 13, 2025
అదానీ కోసమే భూటాన్‌కు మోదీ: ప్రియాంక్ ఖర్గే

తన ఫ్రెండ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకే భూటన్‌లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? అదానీ డీల్ కోసం’ అని రాసుకొచ్చారు. అదానీ పవర్‌కు రూ.6000 కోట్ల హైడ్రో ప్రాజెక్ట్ డీల్‌పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్‌లో ఫొటో ట్యాగ్ చేశారు.
News November 13, 2025
ఈ సమయంలో వరిని ఆశించే తెగుళ్లు – నివారణకు సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటలో మెడవిరుపు, గింజ మచ్చ తెగులు, సుడిదోమ, కంకినల్లి ఆశించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరిలో మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే 200 లీటర్ల నీటిలో ఐసోప్రోథియోలేన్ 300ml లేదా కాసుగామైసిన్ 500ml కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. గింజమచ్చ, కంకినల్లిని గమనిస్తే స్పైరోమెసిఫెన్ 1ml+ ప్రొపికొనజోల్ 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News November 13, 2025
గుంటూరు: కిట్స్ అధినేత కోయ సుబ్బారావుకి డాక్టరేట్

కిట్స్ అధినేత కోయ సుబ్బారావుకు విద్యారంగంలో విశిష్ట సేవలకు మలేషియా–అమెరికా మాస్ట్రో గ్లోబల్ యూనివర్సిటీ డాక్టరేట్, భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు-2025 లభించింది. 3 దశాబ్దాలుగా గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ గౌరవం అందినట్లు ఆయన తెలిపారు. గొట్టిపాటి కళ్యాణ మండపంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,రాయపాటి గోపాలకృష్ణ, మలినేని పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.


