News November 13, 2025
వేములవాడ: మూడుకు తగ్గిన VIP గెస్ట్ హౌస్‌లు..!

వేములవాడ రాజన్న ఆలయంలో VIP గెస్ట్ హౌస్‌ల సంఖ్య మూడుకు తగ్గిపోయింది. భీమేశ్వరాలయం పక్కన మొత్తం 5 గెస్ట్ హౌస్‌లు ఉండగా, ఇటీవలి మార్పులలో భాగంగా ఒకదాంట్లో PRO కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరోదాంట్లో లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాజన్న భక్తుల కోసం మిగిలిన అతిథి గృహాల సంఖ్య మూడుకు తగ్గింది. ఆలయాభివృద్ధి పనుల నేపథ్యంలో కూల్చివేతల జరుగుతున్నందున ఈ మార్పులు జరుగుతున్నాయి.
Similar News
News November 13, 2025
నిర్మల్‌లో జిల్లా స్థాయి నెట్‌బాల్ జట్ల ఎంపిక

నిర్మల్ NTR మినీ స్టేడియంలో నవంబర్ 15న U-14, U-17 బాల, బాలికల నెట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, SGF కార్యదర్శి ఎ.రవీందర్ గౌడ్ తెలిపారు. పాల్గొనేవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు బోనాఫైడ్, జనన సర్టిఫికేట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డ్, ఆధార్ జిరాక్స్‌లతో హాజరుకావాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు.
News November 13, 2025
వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.
News November 13, 2025
భువనగిరి: గంగలోనే శివుడి దర్శనం ఇక్కడి ప్రత్యేకత

రాచకొండ ప్రాంతంలోని ఆరుట్లలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక జాతర కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమైంది. మరో కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో 15 రోజుల పాటు జాతర కొనసాగనుంది. బుగ్గ జాతరలో కార్తీక స్నానం చేస్తే కాశీస్నాన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ గంగలోనే శివుడు దర్శనమివ్వడం ప్రత్యేకత.


