News April 12, 2024

‘ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి ఆమంచికి లేదు’

image

ఆమంచి కృష్ణమోహన్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ నాయకులు హెచ్చరించారు. చీరాలలో పట్టణ అధ్యక్షుడు కొండ్రు బాబ్జి మాట్లాడుతూ.. చీరాలను ప్రశాంత వాతావరణంలో పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపారని, అదే సీను 2024 ఎన్నికల్లో మరోసారి చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Similar News

News March 23, 2026

కందుకూరులో వ్యభిచారం.. మహిళలు అరెస్ట్

image

ప్రకాశం జిల్లాలో వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఎస్ఐ పులి శివ నాగరాజుకు సమాచారం అందింది. తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.

News March 23, 2026

చీమకుర్తిపై యుద్ధం ఎఫెక్ట్..!

image

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రానైట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీనికి యుద్ధం తోడు కావడంతో చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. యుద్ధం నేపథ్యంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ పరిశ్రమల కష్టాలు మరింత పెరిగాయి. క్వారీల్లో భారీ యంత్రాలకు ఈ డీజిల్ చాలా అవసరం. దీనిపై సబ్సిడీలు ఇస్తేనే గ్రానైట్ రంగం గట్టెక్కుతుందని పలువురు కోరుతున్నారు.

News March 23, 2026

ఒంగోలులో జాబ్ మేళా.. రూ.41 వేల జీతం.!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పలు ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, 18 నుంచి 35 ఏళ్ల వయసు గలవారు అర్హులని తెలిపారు. రూ.14 వేల నుంచి రూ.41 వేల వరకు వేతనం అందే అవకాశం ఉందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చన్నారు.