News November 13, 2025
CBN గారూ.. మీ ‘క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుంది: జగన్

AP: క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ CM CBNపై YCP అధినేత జగన్ విమర్శలకు దిగారు. ‘YCP హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను మేమే కట్టేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87వేల ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు కట్టించినవే’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 13, 2025
కూరగాయల సాగు.. ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

TG: రాష్ట్రంలో ఏటా 10వేల ఎకరాల మేర కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు ఈ సీజన్ నుంచే ఎకరాకు రూ.9,600 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అటు పలు రకాల కూరగాయల నారు కూడా సిద్ధం చేసింది. నారు అవసరం ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. నారు, సబ్సిడీ కావాల్సిన రైతులు సంబంధిత మండలాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 13, 2025
శీతాకాలంలో స్కిన్ బావుండాలంటే..

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News November 13, 2025
ఫ్రీ బస్ పథకం.. ఆర్టీసీకి రూ.7980Cr చెల్లింపు: మంత్రి పొన్నం

TG: RTCలో ఇప్పటి వరకు మహిళలు 237కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ప్రభుత్వం RTCకి ₹7980Cr చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RTC ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల ప్రొవిజనల్ పీరియడ్‌ను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించాలన్నారు.


