News November 13, 2025
సిరిసిల్ల: కాయగూరల ధరలు పైపైకి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం రైతు బజార్ నిర్వహించగా కాకరకాయ కేజీ రూ.80/-, బెండకాయ 89/-, చిక్కుడుకాయ 80/-, మిర్చి 50/-, వంకాయ 89/-, క్యాప్సికం 70/- కాలీఫ్లవర్ 70/-లుగా పలుకుతోంది. ఇటీవల సంభవించిన తుఫాన్ వల్ల చాలా ప్రాంతాలలో రైతులు కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ధరలు కొండెక్కాయి. మరి మీ ఏరియాలో కాయగూరల ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 13, 2025
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DM&HO

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యశాఖ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. PHCలలో నోడల్ పర్సన్స్ చాలా కీలకమని అన్నారు. హెల్త్ ప్రోగ్రాంలో టార్గెట్లను పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ఓ వరలక్ష్మి ఇతర సిబ్బంది ఉన్నారు.
News November 13, 2025
ఫ్రీ బస్ పథకం.. ఆర్టీసీకి రూ.7980Cr చెల్లింపు: మంత్రి పొన్నం

TG: RTCలో ఇప్పటి వరకు మహిళలు 237కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ప్రభుత్వం RTCకి ₹7980Cr చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RTC ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల ప్రొవిజనల్ పీరియడ్‌ను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించాలన్నారు.
News November 13, 2025
జంగారెడ్డిగూడెం: చోరీకి పాల్పడిన దొంగ అరెస్ట్

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో సెప్టెంబరు 22న వందనపు లక్ష్మీ కుమారి ఇంట్లో జరిగిన రూ. 42 లక్షల దోపిడీ కేసులో, గతంలో నలుగురిని అరెస్టు చేయగా, తాజాగా కావేటి చిన్నను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుస్మిత రామనాథన్ గురువారం తెలిపారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


