News November 13, 2025
VKB: కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త

వికారాబాద్ జిల్లాలో రాబోయే వారం రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News November 13, 2025
భద్రాద్రి: డోలీలోనే ప్రసవం.. రోడ్డు లేక గిరిజనుల కష్టం

గ్రామాలు పట్టణాలుగా మారుతున్నా జిల్లాలో పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. బూర్గంపాడు(M) మోత పట్టి నగర్‌లోని చింతకుంట గిరిజన గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం దక్కలేదు. బుధవారం పురిటి నొప్పులు రావడంతో ఓ గర్భిణి గ్రామస్థులు కిలోమీటరు డోలీలో మోసుకురావాల్సి వచ్చింది. సకాలంలో 108 వచ్చినా, రోడ్డు అధ్వానంగా ఉండటంతో, ఆమె దారి మధ్యలోనే అంబులెన్స్‌లో ప్రసవించింది. రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్థులు కోరారు.
News November 13, 2025
భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News November 13, 2025
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు.


