News November 13, 2025
జూబ్లీబైపోల్: డివిజన్ల వారీగా ఓటింగ్ వివరాలు

1.షేక్‌పేట్ ఓటర్లు 71,062, పోలైన ఓట్లు 31,182(43.87%)
2.రహమత్‌నగర్ ఓటర్లు 74,387 పోలైన ఓట్లు 40,610(54.59%)
3.యూసుఫ్‌గూడ ఓటర్లు 55,705, పోలైన ఓట్లు 24219(43.47%)
4.ఎర్రగడ్డ ఓటర్లు 58,752, పోలైన ఓట్లు 29,112(49.55)
5.బోరబండ ఓటర్లు 53,211, పోలైనవి 29,760 (55.92%)
6.వెంగళ్‌రావునగర్ ఓటర్లు 53,595, పోలైన ఓట్లు 25,195(47.00%)
7.సోమాజిగూడ(PART) ఓటర్లు 34,653, పోలైన ఓట్లు14,553( 41.99%)
Similar News
News November 13, 2025
భద్రాద్రి: డోలీలోనే ప్రసవం.. రోడ్డు లేక గిరిజనుల కష్టం

గ్రామాలు పట్టణాలుగా మారుతున్నా జిల్లాలో పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. బూర్గంపాడు(M) మోత పట్టి నగర్‌లోని చింతకుంట గిరిజన గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం దక్కలేదు. బుధవారం పురిటి నొప్పులు రావడంతో ఓ గర్భిణి గ్రామస్థులు కిలోమీటరు డోలీలో మోసుకురావాల్సి వచ్చింది. సకాలంలో 108 వచ్చినా, రోడ్డు అధ్వానంగా ఉండటంతో, ఆమె దారి మధ్యలోనే అంబులెన్స్‌లో ప్రసవించింది. రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్థులు కోరారు.
News November 13, 2025
భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News November 13, 2025
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు.


